మాడుగుల, అనకాపల్లి జిల్లా:
చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన అపురూప కట్టడాలు పాలకుల నిర్లక్ష్యం, కాలగమనంలో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం, ఒమ్మలి, ఒమ్మలి జగన్నాధపురం - మోక్ష కృష్ణాపురం గ్రామ శివారులో వెలసిన పురాతన హరిహర క్షేత్రం నేడు ఆదరణకు నోచుకోక దీనస్థితిలో దర్శనమిస్తోంది.
ఆలయ ప్రత్యేకతలు:
- శిలా సంపద: ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించబడింది. నాటి శిల్పుల నైపుణ్యానికి అద్దం పట్టేలా స్తంభాలపై చెక్కిన ఆకృతులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.
- ప్రశాంత వాతావరణం: పొలాల మధ్య, ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మికతతో పాటు ప్రశాంతతను పంచుతోంది.
- చారిత్రక ప్రాధాన్యత: స్థానికుల కథనం ప్రకారం, ఇది కొన్ని వందల ఏళ్ల నాటి ఆలయం. గర్భాలయంలో కొలువై ఉన్న శివకేశవలు విగ్రహలు భక్తులను కట్టిపడేస్తోంది.
ఆవేదనలో భక్తులు:
ప్రస్తుతం ఈ ఆలయం చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచి, పైకప్పు శిథిలమై ప్రమాదకరంగా మారింది. వర్షం వస్తే ఆలయం లోపలికి నీరు చేరుతోందని, సరైన దారి లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"మన పూర్వీకులు అందించిన ఇటువంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రభుత్వం, పురావస్తు శాఖ స్పందించి ఈ ఆలయానికి పునర్వైభవం తీసుకురావాలి." — స్థానిక భక్తులు
అధికారులు స్పందించి ఈ పురాతన ఆలయాన్ని పునరుద్ధరించి, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
0 కామెంట్‌లు