కన్నతల్లి సేవలో ధన్యజీవి: రిటైర్డ్ జవాన్ జొన్నపల్లి శివ గణేష్ ఆదర్శం



మాడుగుల 9 న్యూస్ : మాతృభూమిరక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన ఒక సైనికుడు, నేడు తన పుట్టిన గడ్డపై కన్నతల్లికి సేవ చేస్తూనే, పురాతన ఆలయ పునరుద్ధరణకు పూనుకోవడం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఒమ్మలి గ్రామనికి చెందిన జొన్నపల్లి కొండబాబు, రమణమ్మ దంపతుల కుమారుడు జొన్నపల్లి శివ గణేష్ ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది

మాతృదేవోభవ: మంచాన ఉన్న తల్లికి సేవ చేస్తూ..

​జొన్నపల్లి కొండబాబు, రమణమ్మ దంపతుల కుమారుడు శివ గణేష్ గారు భారత సైన్యంలో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయ్యారు. విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ సమయంలో, పక్షవాతంతో బాధపడుతున్న తన తల్లి రమణమ్మ గారికి అన్నీ తానై సేవలు చేస్తున్నారు. దేశ సేవ ఎంత ముఖ్యమో, జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసుకోవడం అంతకంటే ముఖ్యం వ్యవసాయ పనులు చూసుకుంటూ తల్లిదండ్రుల సేవలో తరిస్తున్నాడు.

పురాతన ఆలయ అభివృద్ధికి నడుం బిగించి..

​కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా, ఆధ్యాత్మిక సేవే లక్ష్యంగా తన గ్రామంలోని పురాతన స్వయంభు ముఖలింగేశ్వర ఆలయ అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ ఆలయానికి సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు, ఆలయానికి ప్రధానమైన సమస్య ధ్వజస్తంభం, వంతెన నిర్మాణం,శ్రీకృష్ణుడు ఆలయానికి వంతిన వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తపన పడుతున్నారు.

గ్రామస్తుల ప్రశంసలు:

 దేశం గర్వించేలా చేసి, ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న గణేష్ గారిని చూసి ఒమ్మలి గ్రామస్తులు గర్వపడుతున్నారు. మాతృభక్తి, దైవభక్తి కలగలిసిన ఆయన ప్రస్థానం నేటి యువతకు ఒక గొప్ప సందేశం.

​మా సెల్యూట్ మీకు:

కష్టాలెదురైనా వెనకడుగు వేయకుండా, కుటుంబం పట్ల బాధ్యతను, దైవం పట్ల భక్తిని మరియు సమాజం పట్ల గౌరవాన్ని చాటుతున్న జొన్నపల్లి శివ గణేష్ గారు నేటి యువతకు నిజమైన రోల్ మోడల్.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు