టిటిడి శ్రీవాణి ట్రస్ట్ సౌజన్యంతో.. ఒమ్మలి జగన్నాధపురంలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం!
అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 14 : మాడుగుల మండలం ఒమ్మలి జగన్నాధపురం గ్రామంలో ఈరోజు ఉదయం 10 గంటలకు నూతన శ్రీకృష్ణ ఆలయ శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు మరియు ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని కృష్ణుడికి పూజలు అందించారు. గ్రామంలో శ్రీకృష్ణుడి ఆలయం రూపుదిద్దుకోనుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి దైవకృప, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ శ్రీ వాణి ట్రస్టు సౌజన్యంతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు నడుమ శాస్త్రోక్తంగా ఈ శంకుస్థాపన నిర్వహించారు. తమ గ్రామంలో శ్రీకృష్ణుడు ఆలయం నిర్మితమవుతుండడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ టీటీడీ శ్రీవాణి ట్రస్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు గ్రామ పెద్దలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

0 కామెంట్లు