అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 28 : ప్రభావంతో మాడుగుల మండలం వి.జె.పురం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున వరద నీరు చేరింది. గొర్రెగడ్డ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పాటు కాలువల నుంచి వచ్చిన నీరు రామాలయం వీధి, నూకాలమ్మ తల్లి వీధితో పాటు ఎంపీపీ పాఠశాల, పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కార్యాలయ ప్రాంతాలను ముంచెత్తింది.తెల్లవారుజామున 2 గంటల సమయంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండగా, ఉదయం 6 గంటల సమయానికి నీరు కొంత తగ్గుముఖం పట్టినట్లు స్థానిక సమాచారం. గ్రామ పరిసరాల్లో పంట పొలాలు అధికంగా నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువుల కొట్టాల వద్దకు వెళ్లే రైతులు కూడా వాగు ఉద్ధృతి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట నష్టం, సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.
0 కామెంట్లు