అనకాపల్లి జిల్లా వి. మాడుగుల మండలం ఒమ్మలి గ్రామంలో అరుదైన పురాతన ఆధారాలు లభ్యమయ్యాయి. గ్రామంలోని పాత ఊరు ఉన్న ప్రాంతంలో మట్టిలో తవ్వుతుండగా, రాయిలా మారిపోయిన ధాన్యపు గింజల గుచ్ఛం బయటపడింది. నల్లటి శిలారూపంలో ఉన్న ఈ వస్తువుపై వడ్ల గింజల ఆకారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒమ్మలి గ్రామం ఇప్పటికే పురావస్తు శాఖ రికార్డుల్లో బౌద్ధ క్షేత్రంగా గుర్తింపు పొందింది. గతంలో ఇక్కడ బౌద్ధ విగ్రహాలు, ప్రాచీన ఇటుకలు లభించాయి. తాజాగా దొరికిన ఈ ధాన్యపు శిలాజాలు కొన్ని వందల ఏళ్ల క్రితం నాటివని, ఆ కాలంలో సంభవించిన అగ్నిప్రమాదాల వల్ల లేదా భూగర్భ మార్పుల వల్ల ధాన్యం ఇలా రాయిలా మారి ఉండవచ్చని భావిస్తున్నారు.
2015-16 ప్రాంతంలో పురావస్తు శాఖ జరిపిన పరిశోధనల్లో ఒమ్మలి గ్రామంలో ఒక పురాతన బౌద్ధ క్షేత్రం ఉన్నట్లు నిర్ధారించారు. ఈ క్షేత్రం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు, అంటే దాదాపు వెయ్యి ఏళ్ల పాటు వర్ధిల్లినట్లు ఆధారాలు లభించాయి. సాధారణంగా మన రాష్ట్రంలో బౌద్ధ క్షేత్రాలు తీర ప్రాంతాల్లో ఉంటాయి, కానీ ఇది తీరానికి దూరంగా కొండల సమీపంలో ఉండటం ఒక ప్రత్యేకత.
1 కామెంట్లు
సూపర్ 👌🏻
రిప్లయితొలగించండి