అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 27 : ఒమ్మలి గ్రామంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం ఊపందుకుంది. కూటమి కార్యకర్తలు, వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే గ్రామానికి చెందిన పాలశెట్టి మహేష్ వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తాలిపురెడ్డి రాజారాం గారు మహేష్‌కు పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ బద్ధపు భాస్కరరావు, పూసర్ల వెంకటరావు, బద్దపు ఆదినారాయణ, కర్రీ నాగేశ్వరరావు, కర్రి రాజబాబు, గొల్లవిల్లి విజయ్ కుమార్, కాత రమణ, శానపతి సత్యం అప్పారావు, గుమ్మాల చంద్రరావు,ఎడ్ల సూరిబాబు, అర్లి చిన్న ఎలక అప్పలరాజు , పలువురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

0 కామెంట్‌లు