అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 28 : అర్నాబ్ తుపాను నేపథ్యంలో పెద్దేరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నందున ఆరు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు .మాడుగుల, అనకాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం, కశింకోట, రాంబిల్లి మండలాల్లోని ప్రభావిత గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. నదులు, వాగులు, కాలువల సమీపానికి వెళ్లవద్దని, నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలను దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. తుపాను పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తమ ప్రాణరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.

0 కామెంట్లు