భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ వారి మహా అన్నదానం!
అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 13 : మాడుగుల మండలం ఒమ్మలి గ్రామంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కొలువుదీరిన శ్రీ దుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో రామాలయం ప్రాంగణం వద్ద మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్న సమారాధన నిర్వహించనున్నారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. భవానీ దీక్షలు చేపట్టిన భక్తులు, గ్రామ ప్రజలు మరియు పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

0 కామెంట్లు