ఒమ్మలిలో వైభవంగా దసరా వేడుకలు.. అగ్నిగుండం తొక్కి భక్తిని చాటుకున్న భక్తులు!
అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్)అక్టోబర్ 20 : మాడుగుల మండలంలోని దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఒమ్మలి గ్రామంలోని దుర్గమ్మ ఆలయం వద్ద మంగళవారం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిగుండం తొక్కుతూ భవానీలు భక్తులు అమ్మవారిపై తమకున్న భక్తి విశ్వాసాలను చాటుకున్నారు.అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అగ్నిగుండం కార్యక్రమం దసరా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఇదే సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దసరా వేడుకలతో ఒమ్మలి గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com
0 కామెంట్లు