మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి గారి సహకారంతో గ్రామంలో అభివృద్ధి జాతర!
| మాడుగుల: naga 9 news 23
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాడుగుల నియోజకవర్గ అభివృద్ధిపై శాసనసభ్యులు గౌరవ బండారు సత్యనారాయణ మూర్తి గారు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన చొరవతో, గ్రామాల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయి
గ్రామం అంటే కేవలం ఇళ్లు,
మనుషులు మాత్రమే కాదు.. నిరంతర అభివృద్ధి, పారదర్శక పాలన కలగలిసిన ఒక ఆదర్శ వేదిక. మన గ్రామ సర్పంచ్ సర్పంచ్ సుంకరి సింహాచలం నాయుడు గారు మరియు వార్డు సభ్యుల బృందం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు అభినందనీయం. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు స్వస్తి పలికి, సుమారు 27కు పైగా అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నారు
🛣️ మౌలిక వసతుల కల్పన: సి.సి
మరియు గ్రావల్ రోడ్లు
రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా రికార్డు స్థాయిలో రోడ్ల నిర్మాణం జరిగింది:
- దుర్గమ్మ గుడి సమీపంలో: సుందరమైన సి.సి రోడ్డు నిర్మాణం.
- వరహాలు మూర్తి ఇంటి నుండి: సి.సి రోడ్డు సదుపాయం.
- కొల్లిమళ్ళ కొండలరావు ఇంటి నుండి: నూతన సి.సి రోడ్డు.
- కర్రీ గంగరాజు ఇంటి నుండి కాశ్మీర్ ఇంటి వరకు: అంతర్గత సి.సి రోడ్డు.
- షేక్ అబ్దుల్లా ఇంటి నుండి గుండా పద్మ ఇంటి వరకు: సి.సి రోడ్డు నిర్మాణం.
- ఇపురెడ్డి శంకర్ ఇంటి నుండి కాత మోదీ నాయుడు ఇంటి వరకు: కొత్త సి.సి రోడ్డు.
- తాటికొండ అప్పారావు ఇంటి నుండి జొన్నపల్లి వారి పాక వరకు: సి.సి రోడ్డు.
- జె.డి పేట RMB రోడ్డు నుండి సవడ చెరువు వరకు: గ్రావల్ రోడ్డు నిర్మాణం.
- మహాలక్ష్మి నాయుడు కళ్ళం నుండి సంజీవి కళ్ళం వరకు: గ్రావల్ రోడ్డు నిర్మాణం.
🌊 పారిశుద్ధ్యం మరియు డ్రైనేజీ వ్యవస్థ
గ్రామ ఆరోగ్యం మురుగునీటి పారుదలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే అత్యధిక ప్రాధాన్యత డ్రైనేజీలకు ఇవ్వబడింది:
- మోదకొండమ్మ ఆర్చి వద్ద: నూతన డ్రైనేజీ కాలువ.
- హైస్కూల్ వెనుక భాగం: ప్రధాన డ్రైనేజీ కాలువ నిర్మాణం.
- కరణం అప్పారావు ఇంటి సమీపంలో: డ్రైనేజీ సౌకర్యం.
- సచివాలయం పక్కన: కొత్త డ్రైనేజీ కాలువ.
- పూసర్ల బుజ్జి ఇంటి పక్కన: డ్రైనేజీ కాలువ నిర్మాణం.
- చిన్న ఎస్సీ కాలనీ పైన: వ్యవస్థీకృత డ్రైనేజీ కాలువ.
- తాటికొండ నాగభూషణ్ ఇంటి నుండి: సి.సి రోడ్డు మరియు డ్రైనేజీ.
- చిలుక బాబు ఇంటి నుండి చిట్టగెడ్డ వరకు: డ్రైనేజీ మరియు మట్టి రోడ్డు.
- ముగుండా రవణ ఇంటి నుండి కారిగడ్డ వరకు: డ్రైనేజీ కాలువ.
- గొర్లి అప్పలనాయుడు కళ్ళం నుండి చిట్టగడ్డ వరకు: డ్రైనేజీ కాలువ.
- పంచాయతీ కార్యాలయం వద్ద: ఆధునిక డ్రైనేజీ నిర్మాణం.
🏥 విద్యా మరియు వృద్ధి
- అంగన్వాడీ సెంటర్-1: ఎన్నాళ్లుగానో శిథిలావస్థలో ఉన్న ఈ బిల్డింగ్‌ను గౌరవ ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవతో, సర్పంచ్ గారు పట్టుబట్టి పూర్తి చేయించి ప్రజలకు అంకితం చేశారు.
- అంగన్వాడీ సెంటర్-2: ఆధునిక బాత్రూమ్ సౌకర్యం.
- అంగన్వాడీ సెంటర్-3: విద్యార్థుల కోసం బాత్రూమ్ నిర్మాణం.
- స్మశానం రోడ్డు: రాకపోకల ఇబ్బంది లేకుండా చిన్న బ్రిడ్జి నిర్మాణం.
- చెత్త సేకరణ కేంద్రం : తడి-పొడి చెత్త కేంద్రానికి రక్షణ ప్రహరీ గోడ నిర్మాణం.
💧 దాహార్తిని తీర్చే దిశగా..
- జల జీవన్ మిషన్: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటి కొళాయి కనెక్షన్లు.
- నూతన వాటర్ ట్యాంక్: గ్రామ భవిష్యత్తు అవసరాల కోసం భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం.
అహర్నిశలు శ్రమిస్తున్న నాయకత్వం!
గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ సుంకరి సింహాచలం నాయుడు గారు, వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు ఎల్లప్పుడూ అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, వ్యవస్థను గౌరవిస్తూ ముందుకు సాగుతున్న ఈ బృందానికి గ్రామ ప్రజలందరూ అండగా నిలుస్తున్నారు.
0 కామెంట్లు