ఆధ్యాత్మిక వెలుగుల్లో జగన్నాధపురం: మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం!

 



​మాడుగుల, ఫిబ్రవరి 10: మాడుగుల మండలంలోని ఒమ్మలి జగన్నాధపురం గ్రామం ఈ నెల 15న రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలోని శివాలయం అత్యంత సుందరంగా ముస్తాబవుతుంది.

వేడుకల ప్రత్యేకలు:

ఈ ఏడాది శివరాత్రి ఉత్సవాలను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని. తెల్లవారుజాము నుంచే పరమేశ్వరునికి పంచామృత అభిషేకాలు, విశేష బిల్వార్చనలు వేద పండితుల సమక్షంలో జరగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము.

​ప్రసాద వితరణ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు:

  • ​మహా అన్నప్రసాదం: స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ మధ్యాహ్నం 12 గంటల నుండి రుచికరమైన అన్నప్రసాద వితరణ జరుగుతుంది.             
  • ​జానపద కోలాటం :సాయంత్రం వేళ ఆధ్యాత్మిక ప్రవచనాలు మరియు స్థానిక కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులకు కనువిందు చేయనున్నాయి.

​నవతరం కోసం డిజిటల్ సౌకర్యం:

పాఠకులు మరియు భక్తుల సౌకర్యార్థం ఈ వేడుకల పూర్తి వివరాలను, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను మా వెబ్‌సైట్ ద్వారా అందిస్తున్నాము. మరిన్ని వివరాల కోసం కింది ఇమేజ్‌లోని QR Code ని స్కాన్ ఇయ్యండి.

గ్రామస్తుల విజ్ఞప్తి:

ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో జరిగే శివారాధనలో పాల్గొని, ఆ భోళాశంకరుని కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని జగన్నాధపురం గ్రామస్తులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు