అనకాపల్లి జిల్లా సపంతపురం గ్రామ శివాలయం సందర్శన – భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తున్న నూతన దేవాలయం

 

అనకాపల్లి జిల్లా: సపంతపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయం ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహ మండపం, అలాగే ఇతర దేవతామూర్తులు భక్తుల దర్శనార్థం కొలువై ఉన్నారు. ప్రతి విగ్రహం ఎంతో అందంగా తీర్చిదిద్దబడింది.ముఖ్యంగా గర్భగుడిలో ప్రతిష్ఠించిన పరమేశ్వరుని శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. పరిశుభ్రమైన ఆలయ ప్రాంగణం, చక్కటి నిర్మాణ శైలి, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి సందర్శకుడికి ప్రశాంతతను అందిస్తున్నాయి.

శివభక్తులు, ఆధ్యాత్మిక ప్రేమికులు సపంతపురం శివాలయాన్ని సందర్శించి పరమశివుని ఆశీస్సులు పొందాలని గ్రామ పెద్దలు స్థానికులు భక్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తల కోసం: Madugula 9 News https://madugula9news.blogspot.com⁠



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు