అనకాపల్లి జిల్లా, మాడుగుల మండలం, ఒమ్మలి, జూలై 21: పోషకాహార లోపాన్ని తగ్గించి గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే ప్రతి గ్రామంలో మునగ చెట్లు ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఒమ్మలి గ్రామంలో ప్రస్తుతం ఒక్క మునగ చెట్టు కూడా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు.
పోషకాలతో నిండిన మునగాకును కూరలు, పప్పు, చారు, ఇతర వంటకాల్లో ఉపయోగించడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు లభిస్తాయి, ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రతి కుటుంబం తమ ఇంటి ఆవరణలో, రైతులు తమ పొలం గట్లు, కల్లాల వద్ద కనీసం ఒక్క మునగ చెట్టును నాటి సంరక్షిస్తే భవిష్యత్తులో ప్రతి ఇంటికి పోషకాహారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడం, పోషకాహారాన్ని ప్రోత్సహించడం, పచ్చదనాన్ని పెంచడం లక్ష్యంగా ఈ అవగాహన కథనం ప్రచురించబడుతోంది. గ్రామ ప్రజలు దీనిపై స్పందించి మునగ చెట్ల పెంపకానికి ముందుకు వస్తే, రాబోయే తరాలకు కూడా ఇది ఉపయోగకరంగా మారుతుంది
0 కామెంట్లు