మాడుగుల 9 న్యూస్ ఆగస్టు 28 :
అనకాపల్లి జిల్లా, వి.మాడుగుల మండలం పరిధిలోని ఒమ్మలి, వి.జె. పురం, మోక్ష కృష్ణాపురం గ్రామాల నడుమ వెలసినటువంటి ప్రసిద్ధ శ్రీ స్వయంభు ముఖలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు వస్తున్నారు. ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ నిమిత్తం గాజువాక నివాసి శ్రీ ప్రగడ సంజీవిరావు గారు రూ. 50,000/- (ఏభై వేల రూపాయలు) విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దాత సంజీవి రావు గారిని ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు శాలువాతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చి విరాళం అందించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు దాత కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు.
మా వద్ద అత్యుత్తమ నాణ్యత కలిగిన అన్ని రకముల ఇంటి పెయింటింగ్స్ మరియు వాల్ పుట్టి అందుబాటులో ఉన్నాయి. ఇంటి లోపలి భాగాలకు (ఇంటీరియర్), బయటి భాగాలకు (ఎక్స్టీరియర్), మరియు వాటర్ ప్రూఫింగ్ పనులకు కావాల్సిన పూర్తి శ్రేణి ఉత్పత్తులు, రంగులు మా వద్ద లభిస్తాయి. సరసమైన ధరలలో, మన్నికైన పెయింటింగ్స్ కోసం మమ్మల్ని సంప్రదించండి.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News https://madugula9news.blogspot.com
.
0 కామెంట్లు