ఎట్టకేలకు కురిసిన వర్షం.. రైతన్నల్లో ఆనందం!
అనకాపల్లి : బుచ్చయ్యపేట మండలంలో వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. గత కొంతకాలంగా వర్షాలు లేక పొలాలు బీడువారడంతో రైతన్నలు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు మండలంలో ఎక్కడా ఆశించిన స్థాయిలో పంటలు వేయలేని దుస్థితి నెలకొంది.
అయితే, తాజాగా మండలంలో కురిసిన వర్షాలకు ఎండిపోయిన భూములు పూర్తిగా తడిశాయి. దీంతో చాలా కాలంగా వానల కోసం ఎదురుచూస్తున్న స్థానిక రైతులు, ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూములు పదును కావడంతో ఇక ఆలస్యం చేయకుండా వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు, విత్తనాలు విత్తేందుకు అన్నదాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ వర్షం తమకు ప్రాణం పోసిందని, ఇదే అదనుగా సకాలంలో సాగు పూర్తి చేసుకుంటామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News https://madugula9news.blogspot.com
0 కామెంట్‌లు