మాడుగుల 9 న్యూస్ : మండలంలోని వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఒమ్మలి గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. పర్యావరణహితమైన మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భక్తితో పాటు ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. 23 ఏళ్లుగా కొనసాగుతున్న వినాయక ఉత్సవ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తూ, మట్టి వినాయకుడి ద్వారా పర్యావరణ పరిరక్షణకు సందేశాన్ని అందించడం విశేషంగా నిలిచింది.
వినాయక ఉత్సవాల్లో భాగంగా సీఆర్పీఎఫ్ జవాన్ కాత అప్పలనాయుడు (హరి) కుటుంబ సమేతంగా శ్రీ సిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఉత్సవ నిర్వాహకులను అభినందించారు.
కుటుంబ సమేతంగా దర్శనం: 🙏
అదేవిధంగా వినాయక ఉత్సవాల్లో భాగంగా 2026 సెప్టెంబర్ 26న భారీ అన్న సమారాధన నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. అదేవిధంగా సెప్టెంబర్ 27న వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.
నిమజ్జన కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువత, భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. మట్టి వినాయకుడి ప్రతిష్టతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇస్తూ, భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీ సిద్ధి వినాయక యూత్‌ను గ్రామస్థులు అభినందిస్తున్నారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com
0 కామెంట్‌లు