మాడుగుల 9 న్యూస్ : ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 25 శుక్రవారం బీఆర్‌టీ నగర్, అనకాపల్లిలో ఉచిత కంటి మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి, విశాఖపట్నం ఆధ్వర్యంలో, రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి, సాయిరాజా వెల్ఫేర్ ట్రస్ట్, తాళ్లపాలెం సహకారంతో ఈ శిబిరం జరిగింది.
ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం-2026 నినాదం ఆరోగ్యకరమైన భవిష్యత్తుల కోసం ఫార్మసిస్టుల సశక్తీకరణ గా ఉంది. ఔషధాల వినియోగం, రోగుల సంరక్షణ, ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.
శిబిరంలో ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి సమస్యతో బాధపడుతున్న రోగులకు తగిన వైద్య చికిత్సలు అవసరమైన వైద్య సూచనలు అందించారు. ఈ సందర్భంగా అనకాపల్లి కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వంకాయల ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్టుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాల ప్రకాష్‌రావు, ఫార్మసీ సంక్షేమ సంఘం ప్రతినిధి హేమంత్ చరపాక, ఫార్మసిస్టులు నల్ల తరుణ్, కాండ్రేగుల లలిత, రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రికి చెందిన పూసర్ల రాజా, శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ప్రతినిధులు, శ్రీ శక్తి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, బీఆర్‌టీ నగర్, అనకాపల్లికు చెందిన ఫార్మసిస్ట్ రత్నాల గిరిజారాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com
0 కామెంట్‌లు