జమ్మాదులపాలెంలో భక్తి శోభ.. శ్రీ శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం.రేపు సారె ఊరేగింపు, అక్టోబర్ 7న అన్న సమారాధన!


జమ్మాదులపాలెంలో శ్రీ గౌరీ పరమేశ్వరుల ఊరేగింపు!

మాడుగుల 9 న్యూస్: కసింకోట మండలం,జమ్మాదులపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల వారి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది! ఈ వేడుకల్లో భాగంగా రేపు ఉదయం 10 గంటల నుండి శ్రీ శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల స్వామి వారి సారె ఊరేగింపు అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. మంగళ వాయిద్యాలు, భక్తి సంబరాల నడుమ ఈ ఊరేగింపు కనులపండువగా సాగనుంది. అలాగే అదే రోజు సాయంత్రం 7 గంటల నుండి గౌరీ పరమేశ్వరుల ఆలయం వద్ద భక్తిశ్రద్ధలతో దీపారాధన కార్యక్రమం నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ఈనెల అక్టోబర్ 7న బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులందరి కోసం మహా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ పవిత్ర మహోత్సవానికి మరియు అన్న సమారాధనకు విచ్చేసి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు