స్వచ్ఛతలో వి.జె.పురం అంగన్‌వాడీ కేంద్రానికి జిల్లా స్థాయి గుర్తింపు



స్వచ్ఛతలో సత్తా చాటిన వి.జె.పురం అంగన్‌వాడీ కేంద్రం.. జిల్లా స్థాయి అవార్డు

మాడుగుల 9 న్యూస్ : అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం వి.జె.పురం అంగన్‌వాడీ కేంద్రం స్వచ్ఛత, సేవా కార్యక్రమాల్లో చూపిన ప్రతిభకు జిల్లా స్థాయి పురస్కారం అందుకుంది. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశుభ్రంగా నిర్వహించడంతో పాటు బాధ్యతాయుతంగా సేవలు అందించిన టీచర్ పి. రమణమ్మ, సూపర్వైజర్ జి.వి. రమణిలను ఈ సందర్భంగా అభినందించారు.పెంటకోట కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా వీరు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ గుర్తింపు ఐసీడీఎస్ శాఖకు కూడా గర్వకారణంగా నిలిచింది. అవార్డు అందుకున్న సిబ్బందిని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఊర్మిళ అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని అంగన్‌వాడీ కేంద్రాలు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి భవిష్యత్తులో మరిన్ని గుర్తింపులు సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు