మాడుగుల 9 న్యూస్ అక్టోబర్ 5 : అనకాపల్లి జిల్లా, వి.మాడుగుల మండలం, ఒమ్మలి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ మాదకొండమ్మ అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందారు. నిత్యం పూజలందుకుంటున్న అమ్మవారి ఆలయాన్ని చైర్మన్ ఉగ్గిన వెంకటరమణ గారు ఇటీవల అత్యంత సుందరంగా అభివృద్ధి చేయడంతో ఆలయ ప్రాంగణం సరికొత్త శోభతో అలరారుతోంది. దివ్యమంగళ స్వరూపంలో కొలువై ఉన్న అమ్మవారిని ఒక్కసారి చూస్తే మనసులో అంతులేని ప్రశాంతత లభిస్తుందని, కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అమ్మవారి మహిమలు తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com
0 కామెంట్లు