మన ఊళ్లలోనే ఇన్ని పురాతన ఆలయాలా? మాడుగుల ప్రాంతంలో ఆసక్తికర విశేషాలు!
మాడుగుల 9 న్యూస్ అక్టోబర్ 9 : అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో పురాతన దేవాలయాలు ప్రత్యేకతను చాటుతున్నాయి. శివాలయాలు, మహావిష్ణువు ఆలయాలు,వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు, గ్రామదేవతలు ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాలకు రాజులు కాలం నాటి చరిత్ర ఉందనే కథనాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. చోళులు వంటి రాజవంశల కాలానికి చెందినవిగా చెప్పబడుతున్న ఆలయాలు చారిత్రక నేపథ్యం పై ఆసక్తి నెలకొంది. ఈ పురాతన ఆలయాల చరిత్ర ఏమిటి? వాటి వెనకున్న విశేషాలు ఏమిటి? ఒక్కో ఆలయానికి సంబంధించిన వివరాలను సేకరించి, చారిత్రక ఆధారాలతో ప్రత్యేక కథనాలను పాఠకులకు అందించేందుకు మాడుగుల 9 న్యూస్ సిద్ధమవుతుంది. మరుగున పడిన ఆలయాలను వాటి విశేషాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

0 కామెంట్లు