కృష్ణమ్మ ఒడిలో దుర్గమ్మ జలవిహారం.. కనులపండువగా హంస వాహన తెప్పోత్సవం!



విజయవాడలో కన్నుల పండుగగా అవసవాహన తెప్పోత్సవం! 

విజయవాడ (మాడుగుల 9 న్యూస)  అక్టోబర్ 21 : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కృష్ణా నదిలో హంస వాహన తెప్పోత్సవం భక్తులను ఆకట్టుకుంది. విద్యుద్దీపాల వెలుగుల్లో అలంకరించిన హంస వాహనంపై అమ్మవారు కృష్ణమ్మ ఒడిలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.అమ్మవారి జలవిహారాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నదీ జలాల్లో వెలుగులు విరజిమ్ముతూ సాగిన తెప్పోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. ఈ వేడుకతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు