మోక్ష కృష్ణాపురంలో ప్రాచీన అమరలింగేశ్వరుడు!



అమరలింగేశ్వర ఆలయం! వెలుగులోకి రావాల్సిన పురాతన విశేషాలు!

మాడుగుల 9 న్యూస్ అక్టోబర్ 10 : అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం మోక్ష కృష్ణాపురం గ్రామంలో పురాతన శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం అలరారుతుంది. ఈ ఆలయం సుమారు 800 వందల సంవత్సరాల నాటిదని స్థానికులు చెబుతున్నారు. కాలక్రమేనా మరుగున పడిన ఈ క్షేత్రం 1885లో గ్రామ పెద్దల  నేతృత్యంలో గ్రామస్తులు పరిసర  ప్రాంత ప్రజల సహాయ సహకారాలతో పునః ప్రారంభించారు. అక్కడి ప్రధాన శివలింగం అరుదైన చతురస్రాకారంలో ఉండటం విశేషం. రాతిశీలలతో చెక్కిన ఆదిపరాశక్తి, కాలభైరవ, సింహం విగ్రహం, సుబ్రమణ్య స్వామి,నాగసర్పాల ప్రాచీన విగ్రహాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణంలో పురాతన ఇటుక వాడడం విశేషం.  అడుగు పొడవు ఎనిమిదంగుళాలు వెడల్పు ఉన్న పురాతన ఇటుకను ఉపయోగించి దివ్య క్షేత్రాన్ని పూర్వం నిర్మించారు. ఈ ఆలయాన్ని భక్తులు అందరూ సందర్శించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com




 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు