ఒమ్మలి మోదకొండమ్మ తల్లికి ఇత్తడి పాదాల సమర్పణ

 

​మాడుగుల:naga 9 news

మండలంలోని ప్రసిద్ధ ఆలయం ఒమ్మలి గ్రామ దేవత శ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారికి నేమాని వెంకటరమణ గారు ఇత్తడి పాదాలను కానుకగా సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఉగ్గిన వెంకటరమణ గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దాత సమర్పించిన ఇత్తడి పాదాలను శాస్త్రోక్తంగా స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి సేవలో భాగస్వాములైన దాత నేమాని వెంకటరమణ గారిని ఆలయ కమిటీ వారు అభినందించారు. ఉండూరు మణికుమార్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు