మాడుగుల:naga 9 news
మాడుగుల మండలం ఒమ్మలి గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం అత్యంత భక్తిశ్రద్ధలతో, సుందరంగా సాగుతోంది. గ్రామస్తులు, భక్తుల సహకారంతో రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు భక్తులు తమకు తోచినంత ఆర్థిక సాయం అందించి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ కోరింది. త్వరలోనే ఆలయ ప్రారంభోత్సవ ముహూర్తాన్ని ఖరారు చేసి, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు.
0 కామెంట్‌లు