మాడుగుల 9 న్యూస్ ఆగస్టు 20 :
ఒమ్మలి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి ఆలయ ప్రారంభ మహోత్సవం మరియు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. 04/09/2026 (శుక్రవారం) నాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వహణ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పవిత్రమైన విగ్రహ ప్రతిష్ఠాపన మరియు ఆలయ ప్రారంభోత్సవ వేడుకలలో గ్రామ ప్రజలందరూ విశేష సంఖ్యలో పాల్గొని, పూజా కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ దివ్య మహోత్సవానికి ఒమ్మలి గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు, యువకులు మరియు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని, కృపాకటాక్షాలు పొందవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News https://madugula9news.blogspot.com
1 కామెంట్లు
జై దుర్గా దేవి నమః🙏🏻
రిప్లయితొలగించండి