అనకాపల్లి జిల్లా: వర్షాలు కురవాల్సిన కాలంలో ఆకాశం వైపు ఎదురుచూపులు.. మరోవైపు మండిపోతున్న ఎండలు. జిల్లాలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇక ప్రపంచ వాతావరణ సంస్థ ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉందని హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీని ప్రభావంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడి, వర్షాభావం, కరువు వంటి పరిస్థితుల ముప్పు పెరగవచ్చని WMO తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అప్రమత్తం చేశారు. నీటిని పొదుపుగా వినియోగించాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ నేపథ్యంలో చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల ప్రజలు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలి.
నీరు వస్తుందిలే అని వృథా చేయకండి.. రేపటి నీటి కష్టాలను నివారించేందుకు ఈరోజే ప్రతి చుక్కను పొదుపు చేయండి.
వర్షాకాలంలోనే ఎండలు ఇంత తీవ్రంగా ఉంటే.. రాబోయే రోజుల్లో నీటి పరిస్థితి ఎలా ఉండబోతుంది?
ఇప్పుడే నీటిని వృథా చేయకుండా పొదుపు చేయాలి. ఈరోజు కాపాడే ప్రతి నీటి చుక్క.. రేపటి నీటి కష్టాలను ఎదుర్కొనే ఆయుధం.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News https://madugula9news.blogspot.com
0 కామెంట్‌లు