ఇతరులకు చెప్పలేదు.. తానే ఆచరించి చూపించాడు!



మధ్యప్రదేశ్: సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మనలోనే మార్పు రావాలని నిరూపించాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు. ఇతరులకు నీతులు చెప్పడం కంటే తానే ముందడుగు వేసి ఆచరించి చూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. 

నదిలో పేరుకుపోయిన చెత్తను చూసి ఇతరులు ఎవరైనా శుభ్రం చేస్తారని ఎదురుచూడలేదు ఓ యువకుడు.రాజ్‌గఢ్ జిల్లా బియోరా ప్రాంతంలోని అజ్నార్ నదిలోకి దిగి, ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్తను స్వయంగా తొలగిస్తూ శుభ్రత కార్యక్రమం చేపట్టాడు. తన కృషితో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన ఈ యువకుడు  బిట్టూ తబాహీ గా ప్రసిద్ధి చెందాడు. ఈ ఘటన ప్రతి ఒక్కరికీ ఒక మంచి సందేశాన్ని ఇస్తోంది.ఇతరులకు ఆచరించమని చెప్పడం కంటే..ముందుగా మనమే ఆచరించి చూపాలి.

మనం మారితేనే సమాజంలో మార్పు మొదలవుతుంది. 🌱మాటలకంటే చేతలే గొప్పవి!

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News https://madugula9news.blogspot.com⁠

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు