🌺 నాగుపాము పడగలా.. మధ్యలో శివలింగం! ఈ నాగపుష్పం చూశారా?


పువ్వు మధ్యలోశివలింగం ఆకారం..చుట్టూనాగుపా గలా! అరుదైన నాగపుష్పం చూపరుల్ని ఆకట్టుకుంటోంది

 అనకాపల్లి : చెట్టంతా పూలతో కళకళలాడుతున్న వేళ.. ఓ పుష్పం మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. పసుపు రంగు పూల గుత్తుల మధ్యలో ఎర్రటి రేకులతో కనిపిస్తున్న ఈ పుష్పాన్ని చూసినవారు ఆసక్తిగా గమనిస్తున్నారు. 

పుష్పం మధ్యభాగాన్ని పరిశీలిస్తే శివలింగం ఉన్నట్టుగా ఆకారం కనిపించగా.. దాని చుట్టూ ఉన్న నిర్మాణం నాగుపాము పడగను తలపిస్తోంది. దీంతో ఈ పుష్పం ప్రత్యేకతపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. 

సాధారణంగా కనిపించే పూలకు భిన్నంగా ఉండే ఆకారం, రంగుల కలయిక ఈ పుష్పానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. చెట్టుపై ఎన్నో పూలు ఉన్నప్పటికీ.. మధ్యలో ప్రత్యేక ఆకృతితో కనిపిస్తున్న 

ఈ పుష్పమే చూపరుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. ప్రకృతిలో ఇలాంటి అద్భుతమైన ఆకృతులు కూడా ఉంటాయా? అంటూ ఈ పుష్పాన్ని చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

🌺 మధ్యలో శివలింగం ఆకారం.. చుట్టూ నాగుపాము పడగలా కనిపిస్తున్న ఈ పుష్పం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News https://madugula9news.blogspot.com⁠

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు