మానసిక ఆరోగ్యంపై అవగాహన.. అనకాపల్లిలో ఘనంగా ర్యాలీ


 ​జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న ఒడిదుడుకులు, ఒత్తిళ్లు, ఆందోళనలు మరియు పరీక్షల భయం వంటి కారణాల వల్ల ఎవరూ తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు!

అనకాపల్లి: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ హాస్పిటల్ లో నసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు గురువారం ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, అధికారులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

జీవితం ఎంతో విలువైనది

జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, సమస్యలు, పరీక్షల భయం వంటి పరిస్థితులతో ఎవరూ తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని నిర్వాహకులు సూచించారు. సమస్య ఏదైనా మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుందని, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఒంటరిగా బాధపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

📞 14416కు ఫోన్ చేయండి

మానసిక ఒత్తిడి లేదా ఇతర మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు టెలి-మానస్ 14416 హెల్ప్‌లైన్‌ను సంప్రదించి సహాయం పొందవచ్చని అవగాహన కల్పించారు. అవసరమైన సమయంలో సహాయం కోరడం బలహీనత కాదని, జీవితాన్ని కాపాడుకునేందుకు తీసుకునే ముఖ్యమైన అడుగు అని సందేశమిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News https://madugula9news.blogspot.com⁠

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు