ఒమ్మలిలో దుర్గమ్మ సందడి.. శక్తి వేషాలతో భక్తులను కట్టిపడేసిన మహిళలు! |
అనకాపల్లి జిల్లా : మాడుగుల మండలంలో ఒమ్మలి గ్రామంలో నూతనంగా నిర్మించిన దుర్గాదేవి అమ్మవారి పసుపు కుంకుమ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు వివిధ శక్తి వేషధారణలతో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా మహిళలే అమ్మవారి శక్తి వేషాలు ధరించి పాల్గొనడం విశేషంగా నిలిచింది. అమ్మవారి రూపాల్లో అలంకరించుకున్న మహిళలను భక్తులు కన్నులు ఆర్పకుండా ఆసక్తిగా తిలకించారు.
వేషధారణల్లో గొర్లి నూకరాజు, దండిపేటి రమేష్ ప్రత్యేక ఆకర్షణ
కార్యక్రమంలో గొర్లి నూకరాజు, దండిపేటి రమేష్ ధరించిన ప్రత్యేక వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేషధారణల్లో తమదైన శైలితో అలరిస్తున్న వీరికి మాడుగుల మండలంలో మంచి గుర్తింపు ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వైవిధ్యమైన వేషాలతో పాల్గొంటూ భక్తులను ఆకట్టుకోవడంలో వీరు ముందుంటున్నారు. వీరి వేషధారణలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ అభినందించారు.
మరోవైపు చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో పాల్గొనడం కూడా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల అందమైన వేషాలు, మహిళల శక్తి వేషాలతో గ్రామంలో భక్తి సందడి నెలకొంది.
మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు నైవేద్య ప్రసాదం అందించారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News https://madugula9news.blogspot.com
0 కామెంట్లు