అంగన్వాడీ ఆధ్వర్యంలో ఒమ్మలిలో పోషణ్ మాసం వేడుకలు!
మాడుగుల 9 న్యూస్ : మాడుగుల మండలంలోని ఒమ్మలి గ్రామం లో సెప్టెంబర్ 26న అంగన్వాడీ కేంద్రం-3 ఆధ్వర్యంలో పోషణ్ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకరి సింహాచలం నాయుడు గారు, టిడిపి నాయకులు ఉగ్గిన శ్రీనివాసరావు, బిజెపి నాయకులు ఉండూరు రాజు,కోసూరు అప్పారావు, జొన్నపల్లి శివ గణేష్, జనసేన నాయకులు తాటికొండ రామకృష్ణ, శానాపతి అశోక్ కుమార్ మరియు అంగన్వాడీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను ప్రదర్శించారు. గ్రామంలోని మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com
0 కామెంట్లు