స్మశానంలో శివుడు విగ్రహం ఎంతగానో భక్తులని ఆకట్టుకుంటుంది!
మాడుగుల 9 న్యూస్ : బుచ్చయ్య పేట మండలం వడ్డాది స్మశానవాటికలో కొలువుదీరిన శివుడు విగ్రహం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్మశానం అంటే భయం అనే భావనను పక్కనపెట్టి, అక్కడ శివయ్యను ప్రతిష్టించడం ద్వారా జీవిత సత్యాన్ని చాటుతున్నారు. మనిషి అహంకారాన్ని నశింపజేసి, అందరూ సమానులే అనే సత్యాన్ని చెప్పడానికి శివుడు శ్మశానవాసి అయ్యాడు. అలాగే మరణంపై భయాన్ని పోగొట్టి, జీవితం తాత్కాలికమనే వైరాగ్య భావనను, ప్రశాంతతను అందించడానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివుని రూపం ఇటు ఆధ్యాత్మికతను, అటు జీవిత పరమార్థాన్ని కళ్లకు కడుతోంది.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com
0 కామెంట్లు