వినాయకుడి ఉత్సవాల్లో ఘనంగా అన్న సమారాధనలు



వినాయక చవితి సందర్భంగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు

మాడుగుల 9 న్యూస్ : వినాయకుడు ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లాలోని  మాడుగుల మండలం గొట్టివాడ అగ్రహారంలో వినాయక చవితి సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అదేవిధంగా బుచ్చయ్యపేట మండలం నీలకంఠపురంలోని కార్యసిద్ధి గణపతి ఆలయం వద్ద అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భక్తి వాతావరణం నెలకొంది.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు