మాడుగుల నియోజకవర్గంలో పాఠశాల కమిటీల్లో మార్పు గాలి.. 64 చోట్ల ఏకపక్ష విజయం!



మాడుగుల నియోజకవర్గంలో SMC ఎన్నికలు.. కూటమి అభ్యర్థుల ఘన విజయం

మాడుగుల 9 న్యూస్ : విద్యావ్యవస్థలో కీలకమైన పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వ్యక్తమైంది. మాడుగుల నియోజకవర్గం పరిధిలోని 67 పాఠశాలలకు గాను 64 కూటమి అభ్యర్థులు విజయం సాధించి కమిటీలను కైవసం చేసుకున్నారు.మెజారిటీ పాఠశాలల్లో ఎలాంటి వివాదాలు లేకుండా, ఏకగ్రీవంగా కమిటీలను ఎన్నుకోవడం విశేషం. విద్యా ప్రమాణాల మెరుగుదలకు, పాఠశాలల అభివృద్ధికి సరికొత్త కమిటీలు బాధ్యతాయుతంగా పనిచేస్తాయని స్థానిక విద్యాభిమానులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయకేతనం ఎగురవేసిన నూతన కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలియజేశారు.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు