శారదా నదీ తీరంలో 189 ఏళ్ల చరిత్ర.. వడ్డాది రామలింగేశ్వరాలయం ప్రత్యేకతలు!
అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 15 : బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలోని శారదా నది తీరాన వెలసిన శ్రీ సర్వమంగళంభా దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన చారిత్రక వివరాలను ఆలయ అర్చకులు రాంపల్లి నాగేశ్వరరావు వెల్లడించారు. 1987లో ముద్రించిన పత్రంలో ప్రస్తుత ధర్మకర్తల పూర్వీకుల సుమారు 150 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని ప్రతిష్టించినట్లు పేర్కొన్నారు. అంటే స్వామివారికి సుమారు 189 ఏళ్ల చరిత్ర ఉండవచ్చని అంచనా. అప్పటి నుంచి భమిడిపాటి వంశీయులు వంశపారంపర్య ధర్మకర్తలుగా ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో భమిడిపాటి భైరవ కృష్ణారావు ఈ నిర్వహణలో కీలకంగా వ్యవహరించినట్లు ఆలయ వివరాలు పేర్కొంటున్నాయి. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామివారి లీల కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు . తిరువీధి సేవ కళ్యాణోత్సవం పుష్పయాగం పవళింపు సేవ తదితర కార్యక్రమాలు ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రతిష్టాపన కాలం నిర్మాణ చరిత్ర పూర్వికులు వివరాలపై పూర్తిస్థాయి పరిశోధన చేస్తే మరిన్ని చారిత్రక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అర్చకులు తెలిపారు. భక్తులు ఆలయాన్ని ఒక్కసారైనా సందర్శించి శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని సందర్శించుకోవాలని కోరారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com


0 కామెంట్లు