వీరనారాయణంలో దేవీ నవరాత్రుల వేల దుర్గమ్మ సన్నిధిలో అన్న సమారాధన!


అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం.. రేపు వీరనారాయణంలో ప్రత్యేక ఏర్పాట్లు!

అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 15 : మాడుగుల మండలం వీరనారాయణం గ్రామంలో దేవి నవరాత్రుల మహోత్సవాలను పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరగనుంది. గ్రామంలోని గొర్లి వారి కల్లాలు వద్ద వెలసిన దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద అక్టోబర్ 16 వా తేదీన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించనున్నారు. గొర్లి వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు పాల్గొననున్నారు. దేవీ నవరాత్రులు పర్వదినాల్లో అమ్మవారి సన్నిధిలో జరిగే అన్న సమారాధనతో భక్తులకు అన్న ప్రసాదు అందించనున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు