ప్రతి సోమవారం ఫిర్యాదులు ఇచ్చేవారికి అలర్ట్.. పీజీఆర్ఎస్పై కలెక్టర్ కీలక ప్రకటన
అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 17 : స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని డిసెంబర్ 3, 2026 వరకు రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రకటించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే (పిజిఆర్ఎస్) కార్యక్రమం రద్దు కావడంతో తమ సమస్యలను ఈ వేదిక ద్వారా అధికారులు దృష్టికి తీసుకువెళ్లాలనుకునే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

0 కామెంట్లు