బైలపూడి గ్రామంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన.. తీవ్ర ఎండల నుండి ఉపశమనం పొందిన స్థానిక ప్రజలు.
అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 18 : మాడుగుల నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానిక నియోజకవర్గ ప్రజలకు ప్రకృతి కాస్త ఉపశమనాన్ని కలిగించింది. చీడికాడ మండలంలోని బైలపూడి గ్రామంలో నిన్న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై, ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. సుమారు గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ అకాల వర్షం కారణంగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. గ్రామ వీధులన్నీ జలమయం కావడంతో పాటు, వాతావరణంలో ఒక్కసారిగా చల్లదనం పెరగడంతో బయలుపూడి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com
0 కామెంట్లు