అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్), అక్టోబర్ 27:మాడుగుల మండలం ఒమ్మలి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త నల్లబోయిన రమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తాలిపరెడ్డి రాజారాం పార్టీ కార్యాలయంలో రమణకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాజారాం గారు పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కట్టుబాటుతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ బద్ధపు భాస్కరరావు, పూసర్ల వెంకటరావు (బుజ్జ), కాత రమణ, ఎలక అప్పలరాజుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.

0 కామెంట్లు