మనిషి డబ్బు కోసం పరుగే పరుగులు. కానీ ఆ పరుగులు ఎక్కడికి ఎందుకోసం!
మాడుగుల 9 న్యూస్ అక్టోబర్ 8 : ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి పరుగే పరుగులు. ఆ పరుగు దేనికోసం అంటే.. ఎక్కువ డబ్బు కోసమే. సంపాదన అవసరమే కానీ డబ్బు కోసం ఆరోగ్యాన్ని కుటుంబాన్ని బంధాలను మనశ్శాంతిని కోల్పోతే ఆ సంపాదన కు అర్థమేమిటి. ఆరోగ్యం ఉన్నప్పుడు డబ్బు కోసం సమయం కేటాయిస్తున్నాం. అదే ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సంపాదించిన డబ్బులనే తిరిగి ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నాం. డబ్బు మనతో రాదు ఆస్తులు మన వెంట రావు మనం చేసిన మంచి పంచిన ప్రేమ మిగిల్చిన జ్ఞాపకాలే మనిషి తర్వాత కూడా నిలుస్తాయి. అందుకే డబ్బు సంపాదించాలి కానీ డబ్బు కోసం జీవితాన్ని కోల్పోకూడదు. మనిషి నిజంగా మారాల్సిన సమయం ఎప్పుడంటే డబ్బు విలువతో పాటు జీవిత విలువను కూడా గుర్తించినప్పుడే.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

0 కామెంట్లు