సోషల్ మీడియా కామెడీ స్టార్ అగ్గిపెట్టి మచ్చ కన్నుమూత!


మాడుగుల 9 న్యూస్ అక్టోబర్ 8 : సోషల్ మీడియాలో తనదైన కామెడీ శైలి మాట తీరు హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ యూట్యూబ్ అగ్గిపెట్టి మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ ఇక లేరు. అనారోగ్యంతో తిరుపతిలో స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ కుమార్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. అగ్గిపెట్టి మచ్చ పేరుతో యూట్యూబ్ సోషల్ మీడియా లో కిరణ్ కుమార్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆయన కామెడీ వీడియోలు డైలాగులు హవభావాలను నిటిజన్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన మృతి వార్తతో అభిమానులు తోటి యూట్యూబ్లో కళాకారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు పలువురు సంతాపం తెలియజేస్తూ కిరణ్ కుమార్ కు నివాళులు అర్పిస్తున్నారు.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు