అనకాపల్లి మాన్యంలో దాగిన అద్భుతం పిట్టగెడ్డ శ్రీ భీమలింగేశ్వర క్షేత్ర ప్రత్యేకతలు!


అతి పురాతన భాషఆనవాళ్లు..బండరాళ్లపై బయటపడిన పిట్టగెడ్డ చారిత్రక శాసనం!  

అనకాపల్లి, (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 12 : అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం పిట్టగెడ్డ అనగా ఒకనాటి పాత గ్రామం మేడవీడి ప్రాంతంలో ప్రకృతి ఒడిలో వెలసిన ఒక అద్భుతమైన శివ క్షేత్రం ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అడవులు జలపాతాల మధ్య ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ఆలయ విశేషాలు గురించి ఇక్కడ అర్చకులు వెల్లంపల్లి కామేశ్వరరావు గారు ఎంతో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పూర్వ పాండవులు తమ వనవాస సమయంలో ఈ అటవీ ప్రాంతంలో సంచరించారని ఆ సమయంలో పాండవుల్లో ఒకరైన భీముడు స్వయంభుగా ఈ శివలింగాన్ని ప్రతిష్టించారని ప్రతీతి. అందుకే ఇక్కడే స్వామివారిని శ్రీ భీమ లింగేశ్వరుడిగా కొలుస్తున్నారని పంచారామ క్షేత్రాల వలె ఇక్కడ స్వామి వారు తెల్లని స్పటిక రూపంలో కనువిందు చేస్తారని ఆయన తెలిపారు. ఒకప్పుడు చాళుక్యులు కాలంనాటి శిల్పకలతో అలరారిన ఈ ఆలయం కాలక్రమేనా శిథిలమై భక్తులు శ్రీ బుద్ధా రామ వరప్రసాద్ నాగరాజేశ్వరి దంపతులు ముందుకు వచ్చి దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పునర్నిర్మించారు. ఇక ఈ క్షేత్రంలో మనకు కనిపించే మరో విశేష ప్రాచీన శిలాశాసనం: ఇక్కడ బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలతో ఉన్న ఒక అరుదైన శిలాశాసనం లభించింది. అయితే ఈ ఆలయం అసలు ఏ కాలానికి చెందిందనేది పురావస్తు శాఖ (Archeological Department) అధికారులు పూర్తిగా పరిశీలించి పరిశోధనలు చేసి కాలాన్ని ఖచ్చితంగా నిర్ధారించాల్సి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నవగ్రహాల పక్షులు మరియు వాహనములపై  ఆసీనులై దర్శనం ఇవ్వడం ఒక అద్భుతం అని చెప్పాలి. వీటితో పాటు ఉత్తర ముఖ కుబేర లింగం, సప్తమాతృకలు కాలభైరవుడు, వీర దక్షిణామూర్తి, నందీశ్వరుడు విగ్రహాలు కూడా ఈ ఆలయ ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి. ఉదయం 6:00 నుండి సాయంత్రం 7:0 గంటల వరకు ఎప్పుడైనా వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలని నిత్య పంచామృతాభిషేకాలు ఎక్కడ ఘనంగా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మన మన్యం ప్రాంతంలో ఇంతటి చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న క్షేత్రాన్ని చూడటం మన అదృష్టం అని చెప్పవచ్చు.



మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు