చరిత్ర పేజీల్లోకెక్కని చారిత్రక అద్భుతం.. ఎల్. కొత్తపల్లి మావుళ్ళమ్మ ఆలయం వెనక విస్మయపరిచే నిజాలు!


చరిత్ర ఉన్నా బయటపడని ఆ రహస్యం ఏంటి? ఎల్.కొత్తపల్లి మావుళ్లమ్మ క్షేత్రం వెనుక దాగున్న మిస్టరీ!

అనకాపల్లి( మాడుగుల 9 న్యూస్ ) అక్టోబర్ 12 : అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం ఎల్.కొత్తపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శక్తి గణపతి సహిత దక్షిణ కాళీ శ్యామలాంబ సహిత శ్రీ ఆదిపరాశక్తి మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం ఒక విస్మయపరిచే చారిత్రక నిధిల దర్శనమిస్తుంది. మరి ఇతర ఆలయాల్లోనూ కనిపించని రీతిలో ఎక్కడ శ్రీ శక్తి గణపతి పక్కనే ప్రత్యేకంగా కొలువుదీరి ఉండటంతో పాటు అమ్మవారు మరియు వివిధ శక్తి రూపాలు అన్నీ ఒకే చోట పక్కపక్కనే కొలువై ఉండటమే ఈ క్షేత్రం యొక్క అత్యంత ప్రధాన ప్రత్యేకత.ఈ ఆలయం కాలక్రమేనా శిథిలమై భక్తులు శ్రీ బుద్ధా రామ వరప్రసాద్ నాగరాజేశ్వరి దంపతులు  నూతన ఆలయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించారు. స్థానిక ప్రాచీన విశ్వాసాల ప్రకారం ఈ క్షేత్రానికి చోళు మహారాజులు కాలం నాటి సుమారు 2000 సంవత్సరాల  ఘనమైన చరిత్ర ఉందనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇప్పటివరకు పురావస్తు అధికారులు ఈ ఆలయాన్ని సందర్శించి శాస్త్రీయంగా పరిశోధించకపోవడం వల్ల ఈ పురాతన క్షేత్రం యొక్క అసలు కథ ఇంకా బయటపడలేదు. ఒకవేళ దీనిపై శాస్త్రీయ పరిశోధనలు జరిపితే ఈ ప్రాంతానికి చెందిన మరిన్ని విస్మయపరిచే చారిత్రక రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు