మాడుగుల నుంచి 3 కి.మీ దూరంలో అద్భుత శివక్షేత్రం.. ఉబ్బలింగేశ్వర ఆలయ చరిత్ర తెలుసా?
అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 18 : చుట్టూ కొండలు ఆహ్లాదకరమైన ప్రకృతి... ప్రశాంత వాతావరణం వీటి మధ్య కొలువుతీరిన శ్రీ ఉబ్బలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను ఆకర్షిస్తుంది. మాడుగుల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం ప్రాచీనతపై ఆసక్తి నెలకొంది. రాజుల పాలనతో చారిత్రక నేపథ్యం కలిగిన మాడుగుల ప్రాంతంలో ఉన్న శివాలయం ఎప్పుడు ఏర్పడింది ఆలయ చరిత్ర ఏమిటి అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పూర్వం మహర్షులు తపస్సు చేసి ఈ శివయ్యని దర్శించుకునేవారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఆలయ ప్రాచీనతపై నిర్ధారించే ఆలయ శాసనాలు చరిత్రక ఆధారాలు నిర్మాణ శైలి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి ఒడిలో కొలువుదీరిన ఈ క్షేత్రం చరిత్ర వెలుగులోకి వస్తే మాడుగుల ప్రాంత ఆధ్యాత్మిక వారకి మరో విశేషం తోడయ్యే అవకాశం ఉంది.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com



0 కామెంట్లు