అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 25 : జనసేన పార్టీ మాడుగుల అసెంబ్లీ స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలో తాటికొండ సత్తిబాబుకు నిర్వాహక దళ్ (ఎగ్జిక్యూటివ్ టీమ్) సభ్యుడిగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఆ కమిటీని ఏర్పాటు చేసినట్టు సమాచారం.క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, పార్టీ నాయకులు, సమన్వయకర్తలతో కలిసి పనిచేయడం, ఎన్నికల వ్యూహాలకు అవసరమైన సమాచారాన్ని సంబంధిత కమిటీలకు అందించడం వంటి అంశాల్లో ఈ బృందం కీలకంగా వ్యవహరించనుంది.మాడుగుల నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల సమన్వయానికి ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. తాటికొండ సత్తిబాబుకు బాధ్యతలు లభించడంతో జనసేన పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

0 కామెంట్లు