బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!


అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 27 : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అర్నబ్ తుపాన్ ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.అధికారిక వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, తుపాన్ విశాఖపట్నానికి సుమారు 350 కి.మీ., కాకినాడకు 420 కి.మీ., మచిలీపట్నానికి 520 కి.మీ., బాపట్లకు 590 కి.మీ. దూరంలో ఉంది. ఈ నెల 28వ తేదీ ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.  

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు