ఆధ్యాత్మిక శోభతో మార్మోగుతున్న అనకాపల్లి జిల్లా!


​అమ్మవారి నామస్మరణతో జిల్లావ్యాప్తంగా పండగ శోభ... మాడుగులలో భారీగా మాలాధారణ!

అనకాపల్లి ( మాడుగుల 9 న్యూస్ ) అక్టోబర్ 13 : పవిత్ర శరన్నవరాత్రుల వేళ అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు మాడుగుల నియోజకవర్గంలో ఊరువాడ దుర్గాదేవి మూర్తులను మంగళ వాయిద్యాలు నడుమ కోలాహలంతో ఊరేగించి పూజా మండపాల్లో నయా మనోహరంగా ప్రతిష్టించారు. ఈసారి అనకాపల్లి జిల్లాలోనే ఎన్నడూ లేని విధంగా మాడుగుల పరిధిలోని అత్యధిక సంఖ్యలో భక్తులు భవాని దీక్షలు స్వీకరించి తమ అపారమైన భక్తి ప్రవర్తలను చాటుతున్నారు. ఈ పావన నవరాత్రుల్లో భవానిలు తీవ్ర నియమనిష్టలతో అమ్మవారి సేవా కార్యక్రమాల్లో మునిగితేలుతూ అమ్మ దుర్గమ్మ దేవి నీవే మా శరణ్యం అని శరణు ఘోష చేస్తున్నారు. జిల్లా అంతటా అమ్మవారి నామస్వరముతో పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకుంది. 

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు