అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 30 : ఇటీవల సంభవించిన అర్నబ్ తుఫాన్ ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా ఏర్పడిన నష్టాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతున్నాయి.
తుఫాను ముగిసిన అనంతరం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పునరుద్ధరణ మరియు బాధితులకు అందుతున్న సహాయక చర్యలు జిల్లా కలెక్టర్ ముమ్మరం చేస్తున్నారు. గురువారం రాత్రి జిల్లాలోని వివిధ శాఖల క్షేత్ర సాయి అధికారులతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదిక పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
మౌలిక సదుపాయాలు పునరుద్ధరణ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. తుఫాను తీవ్రత కారణంగా అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బ తినడం చెట్లు కూలిపోవడం వల్ల రావణా వ్యవస్థ స్తంభించింది అలాగే విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోవడంతో పాటు తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది ఈ పరిస్థితిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ వీలైనంత త్వరగా రవాణా విద్యుత్ మరియు సురక్షిత తాగునీటి వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావాలని ఆదేశించారు.
విద్యుత్ సరఫరా చీకటిలో ఉన్న గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి విద్యుత్ పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. రహదారులు పునరుద్ధరణ మరియు రహదారులపై పడిపోయిన చెట్లను శిధిలాలను తొలగించి రవాణా సౌకర్యాన్ని పొనారుద్ధరించాలని పంచాయతీరాజ్ ఆర్అండ్బీ ధికారులను ఆదేశించారు.
తాగునీటి సరఫరా బాధితులకు ఎలాంటి తాగునీటి ఎద్దడి కలగకుండా ట్యాంకర్ల మరియు మంచినీటి పథకాల ద్వారా నీటిని అందించాలని సూచించారు.
బాధితులకు తక్షణ సహాయక చర్యలు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే ధ్యేయంగా సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు నాణ్యమైన ఆహారం మందులు మరియు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
వర్షాల వల్ల వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉన్నందున పారిశుద్ధ్య పనులను తీవ్రతరం చేయాలని మెడికల్ క్యాంపులను నిర్వహించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ప్రజల జీవనం సాధ్యమైనంత త్వరగా పూర్వస్థితికి చేరేలా ప్రతి శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
క్షేత్రస్థాయిలో ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే పరిష్కరించాలని బాధితులు నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే త్వరితగతిన స్పందించాలని హెచ్చరించారు.విపత్తు సమయంలో అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు ధైర్యాన్ని అందించాలని కోరారు.

0 కామెంట్లు