​ఒమ్మలి ఎంపీటీసీ రేసులో ఎలక అప్పలరాజు.. వేడెక్కిన మాడుగుల రాజకీయం!


అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 28 : మాడుగుల మండల పరిధిలోని ఒమ్మలి గ్రామానికి చెందిన ఎలక అప్పలరాజు వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో స్థానిక రాజకీయం తీవ్ర ఉత్కంఠగా మారింది. సొంత ఊరి నేతే పోటీలో ఉండటంతో ఒమ్మలి గ్రామంలో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ శ్రేణులు ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా, ప్రత్యర్థి వర్గాలు కూడా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గ్రామంలో గడపగడపకూ రాజకీయం చేరడంతో, ఈసారి ఒమ్మలి, vj.పురం, మోక్ష కృష్ణాపురం ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది మండలంలో తీవ్ర ఆసక్తి రేపుతోంది.

కామెంట్ హోమ్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు